రాజన్న రాజ్యం రాకపోతే ప్రజలే తిరగబడతారు

0 9

జగనన్నపై హాట్ కామెంట్స్
హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకే తాను పార్టీ పెట్టినట్టు వైఎస్ షర్మిల అన్నారు. తన అన్న జగన్‌పై అలిగి పార్టీ పెట్టలేదన్నారు. అలిగితే మాట్లాడటం మానేస్తారని, పార్టీలు పెట్టరని వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పరిస్థితుల్లేవని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని, మహిళలంటే వ్రతాలు చేసుకోవాలని చెబుతారని అన్నారు. మహిళలను కేసీఆర్ గౌరవించరని, అలాంటిది కుమారుడు కేటీఆర్ ఎలా గౌరవిస్తాడని షర్మిల వ్యాఖ్యానించారు.నేను ప్రభంజనం సృష్టిస్తానని, కావాలంటే రాసిపెట్టుకోండని షర్మిల్ శపథం చేశారు. అంతేకాదు, వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం రెండేళ్లయ్యిందని, రాజన్న రాజ్యం కోసం పాటుపడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. లేదంటే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు.జగన్, కేసీఆర్ ఇద్దరూ స్నేహితులేనని షర్మిల పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది తన తండ్రి దివంగత వైఎస్సార్ అని,
కాంగ్రెస్‌కి సిగ్గులేదని షర్మిల దుయ్యబట్టారు.రాష్ట్ర ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్టేనా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా..ద్రోహం చేశారా..గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీయే మ్యానిఫెస్టోలో వైఎస్ పెట్టించారని తెలిపారు. వైఎస్ మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యిందని షర్మిల వివరణ ఇచ్చారు.మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని షర్మిల అన్నారు. ‘తెలంగాణ నా గడ్డ.. ఇది నిజం’’ అని తెలిపారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందా? అని నిలదీశారు.కృష్ణా జలాల అంశాన్ని కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా..సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును కూడా వదులుకోమని షర్మిల స్పష్టం చేశారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:If the king’s kingdom does not come, the people will turn around

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page