రాష్ట్ర దళిత మోర్చ సభ

0 8

వేములవాడ  ముచ్చట్లు:

వేములవాడ పట్టణంలో ని బీమేశ్వర గార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర ఎస్సి మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.  సమావేశం కు ఎస్సి మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య, ప్రధాన కార్యదర్శి శాంబునాథ్ తుండియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా లు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి భీమేశ్వర గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  వారిని బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, దళిత మోర్చ్ రాష్ట్ర కార్యదర్శి కుమ్మరి శంకర్ లు స్వాగతం పలికారు.
జ్యోతి ప్రజ్ఞాలన చేసి వందే మాతరం గీతంను ఆలపించి  సమావేశాలను ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్బంగా ఎస్సి మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య మాట్లాడుతూ సమావేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపారు.కెసిఆర్ ప్రభుత్వం దళితుల కోసం ఏం చేసింది ఏమిలేదని, తెలంగాణ లో దళితులపై దాడులు, అవమానాలు చేయడం తప్ప చేసింది ఏమిలేదన్నారు. ఇకదళితులందరు ఏకాం కావాల్సిన సమయం అసన్నమైందని పిలిపించారు.తెలంగాణ లో దళితులు 18 శాతం ఉండగా వెలమలు కేవలం 0.8 శాతం మాత్రమే ఉన్నారని,
దళితులందరు ఏకం అయి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ను గద్దె దించాలని అందుకు ప్రతిఒక్కరు పోరాటం చేయాలని వెల్లడించారు.

- Advertisement -

నరేంద్ర మోడీ దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారని తెలుపారు.
కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పాలించి దళితులకు చేసింది ఏమిలేదని ఈ రెండు పార్టీలను భూస్థాపిత చేయాని పిలుపునిచ్చారు.
నరేంద్రమోదీ పరిపాలనతోనే అభివృద్ధి జరిగిందని, సమాజానికి గుర్తింపు కూడా వచ్చిందన్నారు.
భారత రాజ్యాంగం రాసిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అనికానీ కాంగ్రెస్ హయాంలో డా.అంబేద్కర్ కి ఎంతో అవమానం జరిగిందని, కనీసం ఆయన స్మారక చిహ్నం ఢిల్లీ లో ఏర్పాటు చేయలేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం ద్వారానే ఢిల్లీలో అంబేద్కర్ స్మారక చిహ్నం ఏర్పాటు సాధ్యం అయిందని వెల్లడించారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ జల వివాదం లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అంటూ కేసీఆర్, జగన్ నాటకాలు ఆడుతున్నారని, కమిషన్ల కోసం ఈ ఇద్దరు సిఎం లు జల వివాదం చేస్తున్నారని వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ఏ ప్రాజెక్టు ఆగదని,
తెలంగాణ రావాల్సిన నీటి వాట గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదని, జగన్ నీటి దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు.
2015 లో అపెక్స్ కమిటిలో ఇరు రాష్టాల మధ్య ఒప్పందం జరిగిందని, తెలంగాణ కు 299  టిఎంసి, ఆంద్రప్రదేశ్ కు 512 టిఎంసి కేటాయింపులకు ఒప్పుకోని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కు తెలివి ఉంటే అప్పుడే 575  టిఎంసి వాటర్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని,
తన కమిషన్ల కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశాడని వెల్లడించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర దళిత మోర్చ్ అధ్యక్షులు కొప్పు భాషా, కార్యదర్శి కుమ్మరి శంకర్, ఉపాధ్యక్షులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:State Dalit Morcha Sabha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page