రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

0 12

బీజేవైఎం నాయకుల డిమాండ్

కోరుట్ల  ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రాష్ట్ర నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్ ,కోరుట్ల పట్టణాధ్యక్షుడు ప్రవీణ్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాడిగే మహేష్, ప్రవీణ్ సింగ్ మాట్లాడారు
గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల చేసిన వ్యాఖ్యలు వారు ఖండించారు.
రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేమని యాసంగిలో వానాకాలం పంటల్లో ప్రతి సారి రెండు నెలలపాటు కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని పుష్కలంగా దొరుకుతుందని అంతకుమించి ఎంప్లాయిమెంట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉద్యోగుల పట్ల చేసిన ఆనుచిత వ్యాఖ్యలపై  వెంటనే మంత్రి  తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా కోరుట్ల పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యకుండా కుట్రపూరిత ప్రకటనలతో ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు.మంత్రి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్, పట్టణాధ్యక్షుడు ఠాకూర్ ప్రవీణ్  సింగ్ తోపాటు ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్లి  సాగర్, ఉపాధ్యక్షులు కాసుల వంశీ, వోటరీకరీ నవీన్, రాగంశెట్టి సాయి కృష్ణ, కంటం శ్రీను, సీనియర్ నాయకులు సూరుకుట్ల క్రాంతి, నడిమట్ల కిశోర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:State Agriculture Minister Niranjan Reddy should apologize to the unemployed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page