రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 106

రామసముద్రం ముచ్చట్లు:

 

 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సచివాలయంలో రైతు భరోసా చైతన్యయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ సుభిక్షంగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని అంటే… వైకాపా ప్రభుత్వం వ్యవసాయం పండగ అనే రీతిలోకి రైతులను తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. నాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ కార్యక్రమాలు అమలు చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం రైతు భరోసా అందిస్తూ రైతు పక్షపాతిగా పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి మోహన్ మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలను ఈక్రాప్ నమోదు చేస్తేనే ప్రభుత్వం అందించే సబ్సిడీ అందుతుందన్నారు. వాలింటర్లు అందరూ మీ పరిధిలో ఉన్న రైతులకు ఈక్రాప్ వల్ల చేకూరే లబ్ది వివరించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సిరికల్చర్ అధికారి రాజన్న, సచివాలయ సిబ్బంది బత్తెమ్మ, భారతమ్మ, గౌతమి, ఉపేంద్ర, వీఆర్ఏ మహ్మద్ రఫీ, ఏఎన్ఏం సుగుణమ్మ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, కదిరప్ప, వెంకటరమణ, వాలింటర్లు రేవతి, రెడ్డెమ్మ, మేఘన, పుష్పావతి, దినకర్, కుమారస్వామి, వెంకటరమణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Farmer welfare is the aim of the government – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page