వర్షం కురిస్తే చాలు

0 9

ఆచంట ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పరిధిలో ఉన్న  పెనుగొండ ప్రధాన రహదారి శిధిల వ్యవస్థకు చేరుకుని ప్రయాణికుల పాలిట మృత్యు మార్గంగా మారింది. పెనుగొండ ప్రధాన రహదారి ఓన్ వేగా ఉన్న రహదారిని 2012 -2013 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం సుమారు నాలుగున్నర కోట్లు లతో ఓన్ వే ను టు వే గా వేయడం జరిగింది. వేసిన కొన్ని నెలలో రోడ్డు పూర్తిగా శిధిల వ్యవస్థకు చేరుకుంది. అప్పటి నుండి ఈ రహదారికి ప్యాచి వర్క్లు చేస్తామని ప్రతి సారి  సుమారు 8 లక్షల నుండి 10 లక్షలు పెట్టి  తు తు మంత్రంగా రోడ్డుకు మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. మార్టేరు నుండి పెనుగొండ వెళ్లాలంటే పది నిమిషాలు సమయం పడుతుంది, ఇపుడు ఆ రోడ్డు సారిగా లేకపోవడం తో 40 నిమిషాలు సమయం పడుతుంది. రోడ్డు బాగా గోతుకులతో ఉండడం తో ఎమర్జెన్సీ 108 వాహనాలో  పేషంట్ లను సమయానికి హాస్పిటల్ కి అడ్మిన్ చేయకపోవడం తో అనేక మంది అదే రోడ్డులో మృత్యు వాతకు బలైపోతున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలోని ప్రధాన రహదారి బ్రతుకుట మయంగా మారిన పట్టించుకోకపోవడం పైన స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెనుగొండ రోడ్డున మొత్తం కొత్తగా వేయాలి అంటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Enough rain

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page