వెలుగులోకి సుహాసిని బాగోతాలు

0 16

తిరుపతి ముచ్చట్లు:

 

యువకులను నమ్మించి పెళ్లిళ్లు చేసుకుని నగలు, డబ్బుతో ఉడాయించే కిలేడీ సుహాసిని ఆర్థిక మోసాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అవసరాల పేరుతో ఆమె ఎక్కడికక్కడ అప్పులు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుహాసినినితిరుపతి పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారం తెలుసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన వీరయ్య తిరుపతికి వచ్చి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సుహాసిని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నాయుడుపేట మండలం కోనేటిరాజు పాళ్యానికి చెందిన మేనమామ వెంకటేశ్వర రాజుతో మొదటి వివాహమైంది. ఆయనకు ఆరోగ్యం సరిలేనప్పటి ఫొటోలు చూపి వైద్యం కోసం అప్పు అడిగింది. ప్లాట్‌ పేపర్లు చూపించి పది రోజుల్లో అమ్మి తీర్చేస్తానని రూ.2.17 లక్షల అప్పు తీసుకుంది. సకాలంలో చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాను.పోలీసుల సమక్షంలో అప్పు తిరిగిస్తానని నమ్మించి మూడేళ్లు ఎక్కడికో వెళ్లిపోయింది. భద్రాది కొత్తగూడెంకు చెందిన వినయ్‌, తిరుపతికి చెందిన మరో యువకుడిని మోసం చేసింది. మొదటి భర్తకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ల చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20-30 మంది వరకు ఉన్నారు. ఏవేవో కారణాలతో వారు బయటకు రాలేని పరిస్థితి. పోలీసులు నా డబ్బులు తిరిగి ఇప్పించాలి’ అని వీరయ్య కోరారు. వీరయ్య ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు సుహాసిని మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Suhasini Bagotas into the light

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page