శ్రీశైలం జలాశయానికి వరద నీరు

0 3

శ్రీశైలం  ముచ్చట్లు:

శ్రీశైలం జలాశయానికి  స్వల్పంగా వరదనీటి ప్రవాహం మొదలైంది. గురువారం వరకు జలాశయంలో  నీళ్లు లేక అడుగంటి పోయి డెడ్ లెవల్ స్టోరెజ్ కి చేరువలో ఉంది. అయితే గత వారం రోజులుగా ఎగువ పరీవాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతుంది జూరాల నుంచి 21 వేల 341 క్యూసెక్కులు హంద్రి నుంచి 117 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయాని వరదనీరు వస్తుంది.  శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 806.80 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32. 4687 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ ఫ్లో 21 వేల 458 క్యూసెక్కులు ఉండగా ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్ సాగర్ కు  అవుట్ ఫ్లో గా 7 వేల 063 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలొ విద్యుత్ ఉత్పత్తి కోసం గడిచిన 24 గంటలలో శ్రీశైలం జలాశయంలోని 7 వేల 141 క్యూసెక్కుల వరదనీటిని వినియోగించి 3.126 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Flood water to Srisailam reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page