శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా పార్వేట ఉత్సవం

0 22

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో శుక్ర‌వారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూల‌వ‌ర్ల‌కు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు ఆల‌య ముఖ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని వేంచేపు చేసి యాద‌వ హార‌తి , క్షేమ‌త‌లిగ‌, ఆస్థానం, నివేద‌న నిర్వ‌హించారు. అంత‌కుముందు ఉద‌యం 10 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి ఆణివార ఆస్థానం జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూప‌రింటెండెంట్లు  ర‌మ‌ణ‌య్య‌,  చెంగ‌ల్రాయ‌లు, ఆల‌య అర్చ‌కులు  బాలాజి రంగాచార్యులు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్  యోగానంద‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

 

Tags: Parvati festival is scientifically celebrated in the temple of Sri Kalyana Venkateswaraswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page