షర్మిల లెక్కెంటీ

0 10

హైదరాబాద్  ముచ్చట్లు:

 

 

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ప్రకటన చేశారు. ఇక ఆమె జనంలోకి వెళ్లడమే తరువాయి. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత రాష్ట్రమంతటా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తారంటున్నారు. ఈలోపు నియోజకవర్గాల కమిటీలపై వైఎస్ షర్మిల దృష్టి సారిస్తున్నారు. 119 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించాలన్న పట్టుదలతో ఉన్నారు ఇప్పటి వరకూ జిల్లాల వారీగా సమావేశమైన వైఎస్ షర్మిల నియోజకవర్గాల వారీగా సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావంపైనే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు. వైఎస్ ప్రభావం ఎంత వరకూ ఉంటుదన్నది ప్రశ్న. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి పన్నెండేళ్లు దాటుతుంది. అయినా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. వైఎస్ అమలు చేసిన పథకాలే ఆయన జనం గుండెల్లో నిలిచేలా చేశాయి. అయితే వైఎస్ అభిమానులు షర్మిలకు మద్దతుగా ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే దానికి సమాధానం దొరకదు.2014లో వైఎస్ మరణం తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో అప్పుడు వైసీపీ పోటీ చేసి కేవలం మూడు అసెంబ్లీ స్థానాలను, ఒక్క ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. టీడీపీ కన్నా అతి తక్కువ స్థానాల్లో వైసీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది వైఎస్ షర్మిల గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనే అంత తక్కువగా ప్రజలు తెలంగాణలో వైసీపీ వైపు నిలబడ్డారు.ఇప్పుడు మరింత గ్యాప్ పెరిగింది. తెలంగాణలో అనేక బలమైన పార్టీలున్నాయి. జాతీయపార్టీలు రెండింటితో పాటు అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది. క్యాడర్ లేని, ఓటు బ్యాంకు లేని ఈ పార్టీని వైఎస్ షర్మిల ఎలా నడుపుతారన్నదే ప్రశ్న. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చరిత్ర ఉండి, క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీయే చాప చుట్టేసింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పార్టీ ఎంతమేరకు తెలంగాణలో సక్సెస్ అవుతుందన్నది వేచి చూడాల్సిందే.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Sharmila Lekkenti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page