సేంద్రీయ వ్యవసాయంతోనే అధిక దిగుబడి వ్యవసాయ అధికారి శివశంకర్

0 9

మంత్రాలయం  ముచ్చట్లు:
సేంద్రీయ వ్యవసాయం చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి శివ శంకర్ తెలిపారు. వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలో భాగంగా బూదూరు సూగూరు  గ్రామాలలో   రైతులతో రైతు భరోసా కేంద్రాలలో   అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శివ శంకర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం  చేస్తే పంటల దిగుబడి అధికంగా రావడమే  కాకుండ  పంట నాణ్యత వస్తుందని దీనివల్ల అధిక ధరలు వస్తుంది  తెలిపారు. రైతులు ప్రత్తిపంట  చుట్టూ సజ్జ ,జొన్న వంట వేయటం వల్ల రసం పీల్చే పురుగులు నుంచి పంటను కాపాడుకోవచ్చు అన్నారు. అలాగే లింగాకర్షక బుట్టలు ఎకరాకు 20 బుట్టలు పెట్టడం వల్ల పురుగును నివారించవచ్చు అన్నారు. ఎరువులు మరియు పురుగు మందులను ఎక్కువ మోతాదులో వాడకూడదని పేర్కొన్నారు .పంటకు తగినంత మోతాదులోనే మందులను వాడడం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుందని తెలిపారు.  ఎరువులు పురుగు మందుల కన్నా సేంద్రీయ వ్యవసాయమే రైతులకు చాలా మంచిదని పేర్కొన్నారు. పశువైద్యాధికారి అశోక్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని అన్నారు. పశువులకు చెవి పోగులు వేయించడం వల్ల   రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఒ.నరసింహ ,విఏఏ.సుభాష్ ,వంశీ  గ్రామ  ఉప సర్పంచ్ గోపీనాథ్, రైతులు రామకృష్ణ రామాంజనేయులు అల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:High yields with organic farming
Agriculture Officer Shivshankar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page