సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు

0 5

పెద్దపల్లి  ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివాజీ నగర్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని  ఘనంగా నిర్వహించడం జరిగింది. బిజెపి కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఒకసారి చైర్మన్ గా రెండు సార్లు ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సోమారపు సత్యనారాయణ అభివృద్ధి ఇంటిపేరుగా మార్చుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా గల్లీ గల్లీలో ప్రతి ఇంటిలో వారి యొక్క అభివృద్ధి నినాదాలు వినబడుతుంది ప్రతి పల్లెలో వారి అభివృద్ధి కనబడుతుందన్నారు. రాబోయే 2023 లో కూడా భారతీయ జనతా పార్టీ లో మొట్టమొదటి గెలిచేది రామగుండం నియోజకవర్గం అని రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ను సోమారపు నాయకత్వంలో పిలుపునివ్వడం జరిగింది. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుసుమ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ కుమారి, బిసి మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, బిజెపి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు తడగొండ నరసయ్య, పల్లికొండ నర్సింగ్, గొర్రె రాజు, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శితకారి చంద్రశేఖర్, జనగామ సాగర్, ఉప్పల శ్రీనివాస్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్, బిజేపీ సీనియర్ నాయకులు బోడకొండ జనార్ధన్, బిజినెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాంచందర్, సాగిరి కిషన్ రావు, సత్యనారాయణ రెడ్డి, బిజెపి మండలాధ్యక్షుడు కోమల పురుషోత్తం, మిట్టపల్లి సతీష్ కుమార్, దాసరి శ్రీనివాస్, పెండ్యాల రవి కుమార్, డేవిడ్ రాజు, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శులు బుంగ మహేష్, చిరంజీవి, అనురాగ్, భాషబోయిన వాసు పాల్గొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Somarapu Satyanarayana Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page