హెర్చల్ ప్రొడక్ట్స్ అంటూ 41 లక్షలు దోచేశారు

0 20

హైదరాబాద్  ముచ్చట్లు:

ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో ఓ మహిళ నుంచి లక్షలు దోచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి, అరెస్ట్ చేశారు. సరికొత్త తరహాలో హెర్బల్ ఉత్పత్తుల పేరుతో విదేశీయుడు మహిళను మోసం చేసి ఆమె దగ్గర నుంచి లక్షల్లో దోచుకున్నాడు. మెహదీపట్నంలోని బాధిత మహిళ శైలు కుమారికి ఐవెరీకోస్ట్‌కు చెందిన మెస్సీ ఢాంకో ఫ్రాంక్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తాను హెర్బల్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తామని ఆమెను నమ్మించాడు.వీటికి హైదరాబాద్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. వ్యాపారంలో లాభాలు గడించవచ్చని చెప్పడంతో.. నిజమేని శైలకుమారి పూర్తిగా అతడిని నమ్మింది. తనకు ఆయుర్వేద ఉత్పత్తులను పంపాలని కోరింది. దీంతో రూ.5 కోట్ల విలువైన హెర్బల్ ప్రొడక్ట్స్ ఆమె కోసం సప్లై చేస్తామని నిందితుడు నమ్మ బలికాడు. ఇక్కడే తన ప్లాన్ అమలు చేశాడు. ప్రోడక్ట్స్ పంపాలంటే కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పాడు. కోట్ల విలువైన సరుకు పంపుతున్నామని.. లక్షల్లోనే అడ్వాన్స్ ఇవ్వాలని బుట్టలో వేశాడు.మోసగాడి మాయలను పడిపోయిన ఆమె రూ. 41 లక్షలు తన అకౌంట్ నుంచి బదిలీచేసింది. లక్షలు ముట్టిజెప్పినా అతడి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అతడి చేతిలో మోసపోయినట్టు గ్రహించిన శైలు కుమారి.. పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐవరికోస్ట్‌కు చెందిన మెస్సి ఢాంకో ఫ్రాంక్ ఈ మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కోర్టు ముందు హాజరు పరచడంతో రిమాండ్ విధించింది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:41 lakh was allegedly stolen from Hercel Products

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page