అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల్లో ఫలసాయం సేకరణ      

0 6

-గిరిజనులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ఫారెస్ట్ కాలేజీ, గిరిజన కార్పోరేషన్

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల ద్వారా ఫలసాయం పొందటంపై గిరిజనులకు అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. వన్ ధన్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర గిరిజన సహకార సంస్థతో కలిసి అటవీ కళాశాల ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించారు. చిన్న తరహా అటవీ ఫలసాయాల సేకరణలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ అడవికి, చెట్లకు హాని కల్గించకుండా, మంచి నాణ్యత గల ఫలసాయాలను సేకరించటం, అధిక ఆదాయం పొందడంపై గిరిజనులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. అడవుల నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సేకరించటంలో భాగంగా నిప్పుపెట్టడం, చెట్లు కొట్టేయటం, వన్యప్రాణులకు హానిచేయటం లాంటి కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని తెలిపారు.ఈ శిక్షణ కార్యకమంలో భద్రాచలం , ఉట్నూర్, ఏటూర్నాగారం,మన్ననూర్లలో  గల 17 వన్ ధన్ వికాస కేంద్రాలకు లకు చెందిన 50 మంది గిరిజనులు   మరియు  తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఫీల్డ్ అధికారులు హాజరయ్యారు. వీరందరూ కూడా జులై 19 నుంచి క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో తమ ప్రాంతాల్లో ఉన్న వన్ ధన్ వికాస కేంద్రాల పరిధిలో మిగతా గిరిజన సభ్యులందరికీ శిక్షణ ఇస్తారు. అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ డీన్ ప్రియాంక వర్గీస్ కార్యక్రమాన్ని సమన్యయ పరిచారు. ఈ కార్యక్రమలో అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ గిరిజన మార్కెటింగ్  అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొని వన్ ధన్ ప్రాజెక్ట్ వివరాలు శిక్షణ లో పాల్గొన్న గిరిజనులకు తెలిపారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags; Collection of fruits in a scientific manner without causing damage to forests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page