ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర

0 6

హైదరాబాద్  ముచ్చట్లు:
ఉపాధ్యాయ విద్యా రంగ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్గొండ నుండి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.  ఈ సందర్భంగా పాదయాత్రలో భాగంగా వనస్థలిపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  పాత జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు,బదిలీలు  ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జీవో జారీ చేయాలని అన్నారు.  కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస  వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.  విడుదల చేసిన 63 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమ డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేకపోతే నిత్యావసర సరుకుల సవరణ చట్టం అమలు అవుతే  కరువు ఏర్పడుతుందన్నారు.  పి ఎఫ్ ,ఆర్ డి ఏ .సిపిఎస్ చట్టాలు రద్దు చేయాలన్నారు.  ఓపిఎస్ పెన్షన్ లు అందరికీ అమలు చేయాలని అన్నారు.   ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు  ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Emmelsie Narsireddy Padayatra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page