కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పిన మరో నటి

0 13

ముంబై ముచ్చట్లు :

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. హిందీ టీవీ నటి, స్ప్లిట్స్‌విల్లా ఫేం ఆరాధన శర్మ తాజాగా ఈ జాబితాలో చేరారు. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. “అప్పుడు నేను పుణెలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నా. నాకప్పుడు 19 ఏళ్లు ఉంటాయి. ఒకరోజు స్వస్థలం రాంచికి వెళ్లినపుడు ఓ వ్యక్తిని కలిశాను. అతడు ముంబైలో కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఒక మంచి కారెక్టర్‌ ఉంది. అడిషన్‌ ఇమ్మన్నాడు. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి స్క్రిప్టు చదువుతున్నాం. ఇంతలో అతడు నెమ్మదిగా నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తొలుత నాకేం అర్థంకాలేదు. విషయం అర్థమైన వెంటనే అతడిని తోసేసి గది నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అని తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఆ ఘటన తర్వాత నాకు పురుషులపై నమ్మకం పోయింది. నా మనసులో చెరగని ముద్ర పడింది..అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Another actress who opened her mouth on the casting couch

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page