క్రీడాకారులను ప్రోత్సయించే దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న షాట్స్

0 19

–  నగరం లోని 12 స్టేడియాలు,33 జిల్లా కేంద్రాల వద్ద సెల్ఫి పోటి పాయింట్లు
– రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, చర్చావేదికలు,క్విజ్ పోటిలు

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

జూలై 23 నుండి జపాన్ లో జరుగనున్న టోక్యో ఒలంపిక్ కు మనదేశానికి ప్రాతినిద్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రోత్సయించి వారిలో కొండంత విశ్వాసం నింపే దిశగా తెలంగాణా రాష్ట్ర క్రీడా శాఖ తన వంతు ప్రయత్నం చేస్తుంది.కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడా సాదికార సంస్థ (షాట్స్) టోక్యో ఒలంపిక్ పై క్రిడాభిమానులు, క్రీడాకారులు, యువత, ,విద్యార్థులకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తిది.ఇందిలో బాగంగా క్రీడాశాఖ  ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు ,షాట్స్ చేర్మెన్ అల్లి పురం వెంకటేశ్వర్ రెడ్డి సూచనమేరకు షాట్స్ వివిధ సబ్ కమిటిలను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, చర్చావేదికలు,క్విజ్ పోటిలలాంటి వివిధ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది.వీటి ద్వారా క్రీడాకారులకు శుభసుచనలు తెలియజేసే కార్యక్రమాల ఏర్పాటు వివిధ సామాజిక మాద్యమముల ద్వారా ప్రచారం చేయనున్నారు.క్రీడా కారులు, క్రిడాభిమానులు పలు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ ,వీడియో సందేశాలు సేకరిస్తూ తెలంగాణా రాష్ట్ర క్రీడా శాఖ ఒలంపిక్ లో పాల్గోనే భారత క్రీడాకారులను ప్రోత్స హిస్తుంది.ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగైన ఒలంపిక్ క్రీడల పట్ల యువత, క్రిడాభి మానులు, క్రీడాకారులు సగటు క్రిడాబిమానులలో అవగాహన ఉండాలన్న సదుద్దేశం తో ఈ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తుంది.తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దె దిశగా ముఖ్యమంత్రి కేసిఅర్ చేస్తున్న దశ దిశ  నిర్దేశాన్ని పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఅర్ ఇస్తున్న ప్రోస్సహం,క్రీడాకారుల పనితీరు మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తున్న క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
మానవజేవితం లో క్రీడా ప్రాదాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి క్రీడలు ముఖ్య సాదనమని బావించి దేశం లోనే అత్యున్నత క్రీడా విదానాన్ని తీసుక వచ్చేదిశాగా నలుగురు

 

 

 

 

 

 

మంత్రులతో కూడిన మంత్రి వర్గ  ఉప సంఘాన్ని నియమించింది.క్రీడాభి వృద్ధికి చిత్త శుద్దితో కృషి చేయాలనే ఆలోచనతో 2020-21 సంవస్స్త్సరానికి గాను క్రీడల బర్జేట్ ను 110 కోట్ల రూపాయలకు కేటాయించి మౌలిక సదుపాయాలు, రూపకల్పన,అకాడమి నిర్వహణ, క్రీడా పోటిల నిర్వహణ క్రీడాకారులకు ప్రోస్సహం తదితర అంశాల ద్వారా క్రిడాభి వృద్ధికి కృషి చేస్తుంది.
క్రీడలను ప్రోత్స హించే దిశగా ప్రభుత్వ ఉద్యోగాల్లో  2 శాతం రిజర్వేషన్స్,ప్రొఫెషనల్ కోర్సుల్లో ౦.5 శతం రిజర్వేషన్ లను అమలు పరుస్తుంది.ఉమ్మడి రాష్ట్రము లో కన్నా తెలంగాణా రాష్ట్రము మిన్నగా క్రీడల ప్రోస్సహకాలను  పెంచి పతకాలు సాదించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తుంది. జూలై 23 నుండి టోక్యో లో జరిగే ఒలంపిక్స్ లో పాల్గోనే క్రిదాకారులను ప్రోత్స హించడం ద్వారా సబ్ కమిటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

 

 

 

 

హైదరాబాద్ నగరం లోని 12 స్టేడియాల వద్ద, 33 జిల్లా కేంద్రాల వద్ద సెల్ఫి పోటి పాయింట్లు ఏర్పాటు చేసి వివిధ క్రీడాకారులు,విద్యార్థులు,యువత,క్రిడాభిమానుల ఫోటోలను సేకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తుంది.సెల్ఫి పాయింట్ల నిర్వహణ ద్వారా క్రీడాకారుల్లో మంచి స్పందన కనబడుతుంది.అలాగే క్రిడాభిమానుల నిర్వహణ కమిటి ద్వారా క్రీడాకారులకు శుబాకాంక్షలు తెలియ జేసే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,క్రీడా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు,షాట్స్ చేర్మెన్ ఏ. వెంకటేశ్వర్ రెడ్డి,క్రిదాకరులు, ఒలంపిక్ ప్రతినిధులు,ప్రజా ప్రతినిధులు,స్వయంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గోనే క్రీడాకారులను ప్రోత్స హిస్తూ వారిని సన్మానించి శుబాకాంక్షలు  తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒలంపిక్ లో పాల్గొనే పి.వి. సింధు,సాయి  ప్రనిత , చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్ లతో పాటు కోచ్ లు  పి.గోపి చంద్, ఇస్మాయిల్ బేగ్,నాగపురి రమేష్, అగుస్ పరార సాయి,మేధ మాస్ భో తదితరులను ఈ సందర్బంగా క్రీడా శాఖ మంత్రి సన్మానించారు.

 

 

 

 

హైదరాబాద్ లో శిక్షణ తీసుకొని అంచలంచలుగా ఎదిగి నేడు ఒలంపిక్ లో పాల్గొనడం సంతోషకరమని ఒలంపిక్ లో పథకాలు తెచ్చిన వారిని గొప్పగా సత్కరించాలని బావిస్తూ ముఖ్య మంత్రి కిసిఅర్ సందేశాన్ని క్రీడాకారులకు చదివి విని పించారు.
విద్యార్థులు,యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఒలంపిక్ ప్రోస్సహక కార్యక్రమాల్లో బాగస్వామ్యం చేసేవిదంగా ‘క్విజ్’ పోటిల నిర్వాహన కార్యక్రమాన్ని షాట్స్ నిర్వహిస్తోంది.షాట్స్ ద్వారా ఆన్లైన్ లో  ‘క్విజ్’ నిర్వహిస్తూ ఒలంపిక్ క్రీడల పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
క్రిడాభి మానుల నిర్వాహణ సబ్కమిటి ద్వారా ఒలంపిక్ లో పాల్గొంటున్న మన రాష్ట్ర క్రిడాకారులనే కాకుండా మన దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్న క్రిడాకారులన్దరిని ప్రోత్స హించే విదంగా వారికి శుబాకాంక్షలు,అభినందనలు తెలియ జేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా వివిధ విడియోలు రూపకల్పన చేయడం జరిగింది.

 

 

 

ఒలంపిక్ క్రీడల పట్ల అవగహన, పాల్గొంటున్న క్రిడాకారులను ప్రోత్స హించడం,క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల అభిమానం పెంపొందించడం,విద్యార్థులు, యువతను క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే విదంగా బహుముఖంగా కార్యక్రమాలు నిర్వహించి షాట్స్ అమలు చేస్తుంది.
బంగారు తెలంగాణా సాదన దిశగా ముఖ్య మంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి, ఆలోచనకు అనుగుణంగా ఆచరణలో సాదించే దిశగా రాష్ట్ర క్రీడా శాఖకృషి చేస్తుంది.
పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Shots of various events organized to encourage players

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page