క్రైస్ట్ ఇవాంజెలికల్ లూథరన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ.

0 10

 

నెల్లూరుముచ్చట్లు:

 

- Advertisement -

కంటికి కనిపించని కరోనావైరస్ కష్ట కాలంలో పనులు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు విస్కాన్సిన్ ఎవాంజెలికల్ లూథరన్ సైనాడ్  వారి సహకారంతో క్రైస్ట్ ఎవాంజెలికల్ లూథరన్ మినిస్ట్రీస్ వారి అద్వర్యం లో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని స్థానిక కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలనీలోని క్రైస్ట్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి లో  శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆ చర్చి పాస్టర్ గడ్డం హనోక్ మాట్లాడుతూ ప్రస్తుత కరోన కష్ట కాలంలో వెల్స్ వారు సి ఈ ఎల్ ఎం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.అంతే కాకుండా నెల్లూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లోని పేదలలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి వారందరికీ నిత్యావసర  పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మనోజ, శాంతమ్మ,రూప,వేణు,పెంచలమ్మ,సురేష్,కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Distribution of essential commodities under the auspices of Christ Evangelical Lutheran Ministries.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page