టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

0 23

విజయనగరం ముచ్చట్లు :

 

తెలుగుదేశం పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. గతంలో ఈమె తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవాళ ఉదయం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుకు పంపనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Former MLA resigns from TDP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page