తిమ్మరుసు’ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసిన సమంత అక్కినేని

0 9

సినిమా  ముచ్చట్లు:

డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌. ‘బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ మ‌రోసారి ‘తిమ్మరుసు’గా మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.శుక్ర‌వారం ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర‌యూనిట్‌. ఈ పాట‌ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుద‌ల చేసి యూనిట్‌ను అభినందించారు. ఇందులో స‌త్య‌దేవ్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సాంగ్‌లో హీరో స‌త్య‌దేవ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ స‌హా కీల‌క పాత్ర‌లో న‌టించిన బ్ర‌హ్మాజీ, ఇంకా వైవా హర్ష క‌నిపిస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ రాసిన ఈ పాట‌..స‌ద‌రు హీరో పాత్ర‌ను ఎలివేట్ చేసేలా పాత్ర గురించి ఓ ఐడియాను క‌లిగించేలా ఈ ప్రమోష‌న‌ల్ సాంగ్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉంది.నటీనటులు: సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు..

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Samantha Akkineni releases Timmarusu’s promotional song

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page