తిరుమలలో జడివాన

0 2

తిరుమల ముచ్చట్లు :

తిరుమలలో శుక్రవారం నుంచి జడివాన కురుస్తోంది. సాయంత్రం ఆరు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్లలోనూ వాహనదారులు అవస్థ పడ్డారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన పుష్పపల్లకి సేవను కూడా వర్షపు జల్లుల నడుమే భక్తులు తిలకించాల్సి వచ్చింది. వర్షం కారణంగా దుకాణాలన్నీ మూతపడగా, కొండపై చలితీవ్రత పెరిగింది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Tirumalalo jadivana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page