తిరుమల కొండపై తెలంగాణ భక్తుల ఆందోళన

0 16

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల కొండపై శుక్రవారం రాత్రి తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి తాము తీసుకొచ్చిన ప్రముఖుల సిఫార్సు లేఖలను ఉదయం తీసుకుని.. అర్ధరాత్రి అవుతున్నా టికెట్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటలైనా దర్శనం కేటాయింపు మెసెజ్‌ రాకపోవడంతో భక్తులందరూ టికెట్లు విక్రయించే ఎంబీసీ 34కు చేరుకున్నారు. ఎలాంటి కేటాయింపులు జరగలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సహనం కోల్పోయిన భక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. కొందరు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చివరికి ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని వారికి రూ.300 దర్శనం కల్పించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags; Concern of Telangana devotees on Thirumala hill

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page