నల్ల బ్యాడ్జీలతో హుకుంపేట   వారపు సంతలో ర్యాలి

0 23

హుకుంపేట తహశీల్దార్ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్

పాడేరు    ముచ్చట్లు:
హుకుంపేట ఆదివాసి మహిళా షాప్  కూల్చిన ఘటన  జరిగి నేటికి 20 రోజులు గడుస్తున్నా , తమకు న్యాయం చేయాలని అనేక రూపాల్లో ఉద్యమాం చేపడుతున్న , 13 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ  ప్రభుత్వం, అధికారులు కనీసం స్పందించకపోవడంతో, ఈరోజు హుకంపేట మండల కేంద్రంలో  దీక్షకు  సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.  ముందుగా దీక్ష శిబిరం నుండి ర్యాలీ ప్రారంభమై ఆదివాసి మహిళా షాపును కూల్చివేసిన హుకుంపేట మండల తాహసిల్దారు వై వి కోటేశ్వర్రావు ,పై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన   తహసీల్దార్ వై వి కోటేశ్వర్రావు, వీఆర్వో మీసాల సింహాచలం, పై క్షణమే సస్పెండ్ చేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో 1/70చట్టాం పటిష్టంగా అమలు చేయాలని  , లంచగొండి తాహసిల్దార్ గో…బ్యాక్ అంటూ నినాదాలతో మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కొర్ర కాసులమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు  స్వామి, ప్రజా యోధుడు జె శ్రీ హర్ష మాట్లాడుతూ: ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నేటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం  చాలా దుర్మార్గమని అధికారులు ,ప్రజా ప్రతినిధులు ఎవరి కోసం పని చేస్తున్నారో దీనిబట్టి స్పష్టంగా అర్థమవుతుందని,  ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని అన్నారు . ఈ కార్యక్రమంలో   తెలుగు యువత మండల కార్యదర్శి సిహెచ్ శంకర్,  సర్పంచుల ఫోరం నాయకులు రేగం రమేష్, గిరిజన సంఘం మండల కార్యదర్శి టి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ,  గిరిజన సంఘం నాయకులు రామారావు, సిపిఎం పార్టీ మండల నాయకులు సుడిపల్లి కొండలరావు,   సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి లక్ష్మణ్ రావు, దేవిరాజు, మహిళా నేతలు , కంబిడి లత కుమారి, రూడి రవణమ్మ, కూడా కిషోర్  బాధితులు కొర్లబు  సూర్య మణి ,గోపాల్, తదితరులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Rally at Hukumpeta Weekly Santa with black badges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page