పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు చేయాలి

0 7

పెద్దపల్లి  ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్ లో  జెడ్పి చైర్మన్ పుట్ట మధు అధ్యక్షతన  పెద్దపల్లి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు, ఎమ్మెల్సీ బాను ప్రసాద్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హరితహారం తో పాటు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో  సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్ వంటి ప్రాజెక్టు లు ఉన్న ఈ ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. ఆయా సంస్థలకు నిర్ధేశించిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల సమన్వయం తో  చిట్టాడువిలను పెంచి పొల్యూషన్ ను కంట్రోల్ చేసి వాతావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. పల్లెప్రగతి లో నిరంతరం ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు.  పట్టణ ప్రగతి లో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

 

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:People should be partners in rural development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page