మదనపల్లె అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా వెంకటరెడ్డి యాదవ్‌

0 643

-రాష్ట్ర ఫైన్‌ఆర్టస్ చైర్మన్‌గా నాగభూషణం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లకు, స్థానికసంస్థలకు చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన సలహదారు సజ్జలరామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 135 చైర్మన్‌ పోస్టులకు గాను 68 మహిళలకు, 67 పురుషులకు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అగ్రస్థానం కల్పిస్తూ జాబితాను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తయారు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జాబితాను మంత్రులు సుచరిత, వేణుగోపాలకృష్ణ, ఎంపిలు మోపిదేవి వెంకట్రమణ, నందిగం సురేష్‌, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తో కలసి ప్రకటించారు. ఇందులో చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధేయులకు పట్టం కట్టారు. మదనపల్లె అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా వెంకటరెడ్డి యాదవ్‌,రాష్ట్ర ఫైన్‌ఆర్టస్ చైర్మన్‌గా నాగభూషణం, మదనపల్లె ముస్లిం మైనార్టీ మహిళానేత షమీమ్‌అస్లామ్‌కు రాష్ట్ర ఖనిజాభివృద్ధిశాఖను, చిత్తూరుకు చెందిన విజయనందరెడ్డికి ఆర్టీసి చైర్మన్‌గా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌గా , బీరేంద్రవర్మకు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్‌గా , బైరెడ్డిపల్లె రెడ్డెమ్మకు డిసిసిబి చైర్మన్‌గా , పుంగనూరుకు చెందిన ఖాదర్‌బాషాకు మైనార్టీ కార్పోరేషన్‌ కేటాయించారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Venkatareddy Yadav is the Chairman of Madanapalle Urban Development Authority

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page