మహత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ

0 16

రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రం శంఖవరం గ్రామంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులచే నూతనంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ దేవాదాయ  శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ లు ఆవిష్కరించారు,అనంతరం గ్రామములో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రుల చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిపించారు..
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ నాయకుల చరిత్రను మర్చిపోకూడదని నిరంతరం వారి సేవలను స్మరించుకుంటూ ఉండాలని తెలిపారు కరోనా సంక్షోభం వలన దేశములో రాష్ట్రాలన్నీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆములు పరిచిన  ఘనత  ముఖ్యమంత్రి దని తెలిపారు.  రాష్ట్రములో అగ్రవర్ణాల లో వెనుకబడిన వారికి అండగా జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూ ఎస్ ద్వారా  వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు మేలు చేకూరనుందని తెలిపారు. శంకవరం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు,నియోజకవర్గ పరిధిలోని పలువురు  మంత్రులను శాసనసభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు,పర్వత పూర్ణచంద్ర ప్రసాద్,బదిరెడ్డి గోవింద్,మండల స్థాయి అధికారులు నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘసభ్యులు వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Inauguration of the statue of Mahatma Gandhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page