మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు , సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

0 16

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

మ‌ధ్య‌వ‌ర్తిత్వం త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌దని   మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు  సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ .ఇండియా – సింగ‌పూర్ మీడియేష‌న్ స‌మ్మిట్‌లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడుతూ వివాద ప‌రిష్కారాల్లో రాజ్యాంగ స‌మాన‌త్వం ఉండాల‌న్నారు. మ‌ధ్య‌వ‌ర్తుల‌కు శిక్ష‌ణ ఇస్తే సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. మ‌ధ్య‌వ‌ర్తులు స‌ల‌హాదారుడిగా మార‌డం మంచిది కాదు. మ‌ధ్య‌వ‌ర్తులు మంచి గుణం, నైతిక‌త, పార‌ద‌ర్శ‌క‌త‌, త‌ట‌స్థ‌త‌ క‌లిగి ఉండాలి. కొన్ని ప‌రిస్థితుల్లో మ‌ధ్య‌వ‌ర్తుల‌కు నైతిక అనిశ్చితి ఉంటుంది. తెలంగాణ ప్ర‌త్యామ్నాయ వివాద ప‌రిష్కార వేదిక‌లు ఏర్పాటు చేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ర్టాలు కూడా అమ‌లు చేయాల‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సూచించారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Beneficial to the general public with mediocrity
Chief Justice of the Supreme Court Justice N.V. Ramana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page