రాష్ట్ర క్రీడాభివృద్ది  కార్పొరేషన్  చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి..

0 13

నందికొట్కూరు లో అభిమానుల కోలాహలం…
బాణాసంచా కాల్చి స్వీట్ లు పంచిన వైసీపీ కార్యకర్తలు…

నందికొట్కూరు  ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్ర క్రీడా భివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పదవికి నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శనివారం నామినేటెడ్ పదవులను ప్రకటించింది.
బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి నామినేటేడ్ పదవి దక్కడంతో నందికొట్కూరు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ లు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ గా వచ్చి పటేల్ విగ్రహం కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పాత బస్ స్టాండ్ నందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నామినేటెడ్‌ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   సాహసోపేత  నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చిన ఘనత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.  పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం హర్షణీమన్నారు . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చి వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు చినరాజు, లాల్ ప్రసాద్, గపూర్,వైసీపీ నాయకులు బద్దుల శ్రీకాంత్, రమేష్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ మండ్లెం రమణ, కే. వి. రమణ,   ఉస్మాన్ భేగ్, అబ్దుల్లా, చల్లా శివా రెడ్డి, చింత విజ్జి, కిరణ్ కుమార్ రెడ్డి, మైనార్టీ తాలూకా అధ్యక్షులు అబూ బక్కర్, ఎం ఆర్ పి ఎస్ నాయకులు పగడం రాఘవ,  ఏసన్న, రాజు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

 

Tags:Byreddy Siddhartha Reddy as the Chairman of the State Sports Development Corporation.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page