రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మేరిగ మురళీధర్  మేరిగా సేవలను గుర్తించిన వైఎస్ జగన్

0 35

నెల్లూరు ముచ్చట్లు:

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అనేక కీలక పదవులు అలంకరించి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గా పనిచేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సైనికుడు లా పార్టీ ని ముందుకు నడిపించారు.పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.,2019 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగా మురళిధర్ పేరు ఖరారు అవుతున్న తరుణంలో అనూహ్యంగా ఆయన పేరు బదులు వెలగపల్లి వరప్రసాద్ రావు అధిష్టానం ఖరారు చేయడం జరిగింది.
అయినా పార్టీ నిర్ణయం శిరోధార్యం గా భావించి వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించారు, ఆ తరువాత వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నామిటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరిగా మురళీధర్ సేవలు గుర్తించి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపిక చేసి శనివారం ప్రకటించారు, దింతో మెరిగ మురళి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మేరిగా మురళీధర్ కష్టానికి తగిన ఫలితం పార్టీ ఇవ్వడంతో  వైసీపీ నేతలు, కార్యకర్తలు, మేరిగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Meriga Muralidhar is the Chairman of the State Finance Corporation
YS Pics Recognizing Meriga Services

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page