లోకేష్ కోసం కుప్పం…

0 30

తిరుపతి  ముచ్చట్లు:

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి నారా లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ పూర్తిగా సందిగ్ధంలో ప‌డింది. ఎంట్రీ ఇచ్చిన మొద‌టిసారే ఆయ‌న ఓడిపోవ‌డం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర ఆందోళ‌న రేపింది. ఇప్పుడు అదే స‌మ‌స్య చంద్ర‌బాబుకు పార్టీ కంటే పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. ఇక జ‌గ‌న్ ధాటికి పార్టీ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితికి వ‌చ్చి ప‌డ‌టంతో ఎలాగైనా లోకేష్ ను గెలిపించుకుని పార్టీ ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌నేది చంద్ర‌బాబు నాయుడు ఐడియా.ఇక ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి వ‌ద్ద‌నుకున్న లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేరే నియోజ‌క‌వ‌ర్గానికి మారాల‌ని ఆలోచిస్తున్నారు. త‌న‌కు మంచి విజయావకాశాలు ఉండే వాటిపైన చాలా ర‌కాల స‌ర్వేలు చేసిన ఆయ‌న‌.. ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ త‌న‌కు ప‌ట్టు లేద‌ని తేల‌డంతో చంద్ర‌బాబు చివ‌ర‌కు త‌న నియోజకవర్గమైన కుప్పంను ఇచ్చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇక పార్టీకి ఇప్పుడున్న సిట్టింగ్ స్థానాల‌ను టీడీపీ ఎమ్మెల్యేలు వదులుకోక‌పోవ‌డంతో వేరే ప్ర‌త్యామ్నాయం లేక ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడుకుకు కుప్పంను ఇచ్చేసి చంద్ర‌బాబు వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా లోకేష్ కుప్పంలో కూడా గెలుస్తారా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న‌కు ద‌డ పుట్టిస్తున్నారు. ఇప్ప‌టికే చంద్రబాబుకే షాక్ ఇస్తూ జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అనే జెండాల‌తో నినాదాలు కూడా చేస్తున్నారు. మ‌రి లోకేష్ ధైర్యం చేస్తారా లేదా అన్న‌ది చూడాలి.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Heap for Lokesh …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page