శాంతి భద్రతల పరిరక్షణకు  ప్రత్యేక చర్యలు యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు  జిల్లా ఎస్పీ సింధుశర్మ

0 9

కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 70 మంది యువకులు

జగిత్యాల    ముచ్చట్లు:

- Advertisement -

అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా  తిరుగుతూ అసాంఘిక, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ‘ఆపరేషన్ చబుత్రా’ పేరుతో కోరుట్ల, మెట్పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ముమ్మర త‌నిఖీలు చేపట్టారు.జగిత్యాల జిల్లా ఎస్పీ  సింధు శర్మ   ఆదేశాల మేరకు కోరుట్ల, మెట్పల్లి పట్టణంలో  అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రా ను నిర్వహించారు. యవకులు అర్ధరాత్రి వేళల్లో  ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో  వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా  తిరుగుతున్న 70 మంది యువకులను అదుపులోకి తీసుకోని  వారి బైక్ లను పోలీసులు  సీజ్ చేశారు.వారి తల్లితండ్రుల ను పిలిపించి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూఅసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు  తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని  సూచించారు.అంతేకాకుండా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా ఆపరేషన్ చబుత్రా  స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుంది  అని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా  సంచరిస్తూ సామాన్య  ప్రజానీకానికి,  మహిళల ను ఇబ్బందులకు, అభద్రత భావానికి గురి చేస్తే   వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు  చేస్తామన్నారు.
యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారని సింధుశర్మ సూచించారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Special measures to maintain peace and security
Do not ruin the future of youth
District SP Sindhu Sharma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page