సినిమా ధియేటర్లు ఎప్పుడు

0 3

హైదరాబాద్  ముచ్చట్లు:

 

 

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆ మాటకొస్తే మహమ్మారి ఇప్పట్లో మన సమాజాన్ని వదిలేలా కనిపించడం లేదు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కేసులు భారీగా తగ్గడంతో ప్రభుత్వాలు అన్నిటికీ అనుమతులిచ్చాయి. తెలంగాణలో సాధారణ జనజీవనం సాగుతుంది. టూరిజం నుండి విహారయాత్రల వరకు దేనికీ ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం ఇంకా పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెర్చుకొనేది ఎప్పుడు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణలో సినిమా హాళ్లకు అనుమతిచ్చిన నెల రోజుల అనంతరమే ఏపీలో కూడా అనుమతి ఇచ్చారు. కానీ.. ఇప్పటికీ ఎక్కడా థియేటర్లు తెరుచుకోలేదు. ప్రభుత్వాల నుండి అనుమతులు ఉన్నా తెరుచుకోకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయనిపిస్తుంది. నిజానికి జులై రెండో భాగంలో థియేటర్లు తీర్చుకుంటాయని.. ఆగష్టు మొదటి వారం నుండి కొత్త సినిమాల విడుదల ఉంటుందని అంచనా వేశారు.కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బడా నిర్మాత సురేష్ బాబు లాంటి వాళ్ళు సినిమాను ఓటీటీకి అమ్మేసుకున్నారు. థియేటర్లు తెరిచినా ప్రజలు వచ్చేందుకు సిద్ధంగా లేరని ఓ వాదన వినిపిస్తుంది. ఒకవైపు థర్డ్ వేవ్ భయంతో పాటు రకరకాల పేర్లతో వస్తున్న శక్తివంతమైన వేరియంట్లు ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో యధావిధిగా ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమాను ఆనందించే పరిస్థితి లేకుండాపోయింది. పోనీ సీట్ల ఆక్యుపెన్సీ తగ్గించి ప్రదర్శన చేయాలంటే అందుకు థియేటర్ల యాజమాన్యం సిద్ధంగా లేదు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:When movie theaters

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page