సిరుల త‌ల్లి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి పుష్పాభిషేకం

0 11

తిరుపతి ముచ్చట్లు:

 

 

సిరుల త‌ల్లి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగంలో భాగంగా రెండ‌వ రోజైన శ‌నివారం ఉద‌యం క‌న‌కాంబ‌రాలు, మ‌ల్లెపూలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ యాగం జూలై 24వ తేదీ వ‌రకు ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హిస్తున్నారు.

- Advertisement -

కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ మ‌హాయాగం నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో బాగంగా ఉద‌యం సుప్ర‌భాతంతో అమ్మ‌వారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 గంట‌లకు ఆల‌యంలోని శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో అమ్మ‌వారిని వేంచేపు చేశారు.

టిటిడి పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 180 మంది ఋత్వికులు చ‌తుష్టార్చ‌న‌, కోటి కుంకుమార్చ‌న‌లో ఒక ఆవ‌ర్తి,హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించారు. సాయంత్రం కోటి అర్చ‌న‌, మ‌హా నివేద‌న‌, ల‌ఘు పూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Flower anointing for Sri Padmavati Amma, the mother of Sirula

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page