సెప్టెంబర్ 10న చవతి, 19న నిమజ్జనం

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రెండో ఏడాది కూడా సాదాసీదాగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి సిద్ధమవుతోంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్‌ రావు తెలిపారు. సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని… 19 ఆదివారం నిమిజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కార్యాలయం నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. విగ్రహాల ఏర్పాటుకు కావల్సిన రా మెటీరియల్స్ సమయానికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఉత్సవ సమితి. గణేష్ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. వర్షా కాలం కారణంగా దెబ్బతిన్న జీహెచ్ఎంసీ రోడ్డులు వెంటనే బాగు చేయలని.. నిమిజ్జనం నాటికి సిద్ధం చేయాలని వినతి చేశారు.గణేష్ ఉత్సవాలు సమయంలో విద్యుత్ సరఫరాపైనా దృష్టి పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా నిబంధనలకు అనుగుణంగా గణేష్ మండపంలో అన్ని జాగ్రత్తలు చేపడతామన్నారు. గణేష్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్లైన్స్ చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాల.. డిస్కో పాటలు వద్దని అన్నారు. అందరూ ప్రజ ప్రతినిధులు సహకరించాలని వినతి చేశారు. ఎత్తు గురుంచి తాము ఎప్పుడు గైడ్లైన్స్ ఇవ్వలేదన్నారు. గణేష్ ఉత్సవాల ద్వారా కాలుష్యం లేదని భగవంత్‌రావు స్పష్టం చేశారు. గత ఏడాది నిమిజ్జనం చేసే సమయం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేశాం.. ఈసారి కూడ అలానే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి పేర్కొంది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Chavati on September 10, immersion on the 19th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page