హైదరాబాద్ లో పెరుగుతున్నకరోనా కేసులు

0 11

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ ఆస్పత్రులు మరియు జిల్లాలలో కోవిడ్ -19 కేసులు ఇటీవలికాలంలో తగ్గినప్పటికీ, ఆక్సిజన్ పడకలు మళ్ళీ కరోనావైరస్ రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ లెక్క 1,000 కేసుల కంటే తగ్గినప్పటికీ, యాక్టివ్ కేసులు మాత్రం 10,000 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు. అందులో 4073 మంది ఇప్పటికీ ఆసుపత్రులలో తమ ప్రాణాలతో పోరాడుతున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని డజను ఆస్పత్రులు తమకు ఆక్సిజన్‌పై గణనీయమైన సంఖ్యలో రోగులు ఉన్నట్లుగా చెబుతున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతోందని, కొన్ని ఆసుపత్రులలో పడకలు లేవని చెబుతున్నారు. కేసులలో పెరుగుదల ఉన్నందున, పడకలు నిండడం ప్రారంభం అయ్యిందని ప్రజలందరి కోసం అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్(థానా) అధ్యక్షుడు డాక్టర్ కిషన్ రావు అంటున్నారు.రాష్ట్రంలోని ప్రధాన కోవిడ్ -19 చికిత్సా కేంద్రాలలో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 50 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, గాంధీ ఆసుపత్రిలో కొత్తగా 30 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. “కేసులు మరియు ప్రవేశాల పెరుగుదలను బట్టి, ఆసుపత్రిలో నాన్ కోవిడ్ -19 సేవలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది” అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెస్ట్ ఆసుపత్రిలో 14మంది ఆక్సిజన్ పడకలలో ఉండి చికిత్స తీసుకుంటూ ఉండగా.., కింగ్ కోటి ఆసుపత్రిలో 39మంది ఆక్సిజన్ చికిత్స పొందుతున్నారు.ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ESI ఆసుపత్రిలో 10మంది రోగులు ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆక్సిజన్ పడకలపై గణనీయమైన సంఖ్యలో రోగులతో నగరంలో మరో అరడజను ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రజలు ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Corona cases on the rise in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page