172  ఉత్తర్వుల అమలుపై పునరాలోచన చేయాలి:ఎస్టియు

0 9

పత్తికొండ     ముచ్చట్లు:

 

 

172 ఉత్తర్వుల అమలుపై పునరాలోచన చేయాలని, నూతన విద్యా విధానానికి సంబందించిన లోపాలను సవరించాలని,ప్రాధమిక పాఠశాలలను అదేవిధంగా కొనసాగించాలని స్థానిక ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ కొత్తపల్లి సత్యనారాయణ, ఎస్టియుఏపి పత్తికొండ మండల శాఖ జిల్లా ఆర్థిక కార్యదర్శి రామమోహన రెడ్డి సారధ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి కి ప్రాతినిధ్యం వహిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడున్న విద్యావిధానాన్ని కొనసాగిస్తూ, పూర్వ ప్రాధమిక విద్యను విలీనం చేయడానికి స్వాగతిస్తామన్నారు. ప్రాధమిక పాఠశాలలను విభజించి 3,4,5  తరగతులను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో కలపడం సమంజసంగా లేదని ఎమ్మెల్యే కు వివరించారు. చిన్నపిల్లలు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి ఎలా చదువుకుంటారని  వారు ఎమ్మెల్యే కు వివరించారు. ఇలా నూతన విద్యావిధానం (న్యూ ఎడ్యుకేషన్ పాలసీ) సంబందించిన ఉత్తర్వులను అమలు చేసే ముందు మరొక్కసారి  పునరాలోచించాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. ప్రత్యేక దృష్టి సారించి 172 ప్రభుత్వ ఉత్తర్వుల అమలు పై పునరాలోచించాలని వారు ఎమ్మెల్యే  కు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ఎస్టియు ప్రధాన కార్యదర్సులు చంద్రశేఖర్ రెడ్డి, బలరాముడు, ఆర్థిక కార్యదర్శి వెంకట్రాముడు, నాయకులు రాతన          పెర్లప్ప , మారుతి, నాగరాజు, రాఘవేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:172 The implementation of orders should be reconsidered: STU

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page