19 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

0 7

తిరుపతి  ముచ్చట్లు:

 

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలోప‌ల‌ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఇందులో భాగంగా జూలై 19న కవచాధివాసం, జూలై 20న కవచ ప్రతిష్ఠ, జూలై 21న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం పాలు, పెరుగు, తేనె, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నతిరుమంజనం నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత మ‌హాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను ఆల‌యంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌డ‌తారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Jyeshtabhishekam at Sri Govindarajaswamy Temple on 19th to 21st

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page