23 నుంచి సినిమా హాల్స్

0 13

హైదరాబాద్  ముచ్చట్లు:

 

తెలంగాణలో సినియా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చెయ్యాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి.రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారుటాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు, కరోనా మహమ్మారి, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్‌ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఓటీటీలపై ఆంక్షలు విధిస్తే తప్ప థియేటర్స్‌ తెరవలేమని డిస్ట్రిబ్యూటర్లు మంకుపట్టుపట్టారు. దీంతో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీతో దిగివచ్చారు. థియేటర్లను తెరిచేందుకు అంగీకరించారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags; Cinema Halls from 23rd

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page