చిన్నపిల్లలకి కరోనా-జాగ్రత్తలు పాటించాలి

0 15

చిత్తూరు ముచ్చట్లు:

 

చిన్నపిల్లలకి కరోనా ఎక్కువ వస్తుంది. ఈరోజు వచ్చిన కరోనా రిపోర్ట్ లో మన చిత్తూరు జిల్లాలో సుమారుగా 70 మంది పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చింది.3rd వేవ్ లోకి ప్రవేశించాము… జాగ్రత్తలు పాటించాలి, చాలా మంది కరోనా తగ్గిపోయింది అనే భ్రమలో మాస్క్ వేసుకోవడం మరిచిపోతున్నారు, మాస్క్ లేకుండా విచ్చలవిడిగా బయటకు వెళ్లడం, తోటి పిల్లలతో ఆటలు ఆడటం, పెళ్లిళ్లకు, పేరంటలకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం, మీటింగ్ లు, పెళ్లిళ్లుకు ఎక్కువ మందిని పిలవడం, కలిసి ఎక్కువ మంది భోజనం చేయడం, మన స్టాఫ్ కదా వీళ్ళతో కలిసి భోజనo చేయడం లేదా దగ్గరగా మాట్లాడటం వలన ఏమి కాదు అని అనుకోవడం,నేను వాక్సిన్ రెండు డొసులు వేసుకొన్నాను ఇంక నాకు కరోనా రాదు, నేను మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని మరి కొంతమంది భ్రమలో వున్నారు. ఇలా జాగ్రత్తలు పాటించకుండా ఉంటే 3rd వేవ్, 4th వేవ్, 5th వేవ్ ఇలా చాలా వేవ్ లు వచ్చే అవకాశం వుంది. కావున దయచేసి అందరు సరైన పద్ధతి లో మాస్క్ వేసుకోండి, శానిటైజర్ వాడండి, ఇతరులతో మాట్లాడేటపుడు 6 అడుగుల దూరం పాటించండి,వాక్సిన్ వేసుకున్న తరువాత కూడా కరోనా వచ్చే అవకాశం వుంది కావున జాగ్రత్తలు తప్పక పాటించండి.కిరాణా షాపు, ఇతర వ్యాపార షాపులలో కచ్చితంగా మాస్క్ లేకుంటే ప్రవేశం లేదు అని బోర్డు ఉంచాలి, శానిటైజర్ ఉంచాలి, తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన కరోనా రహిత సమాజం నిర్మించడం లో మన వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం, కరోనా ని తరిమికొడదాం.
మెడికల్ ఆఫీసర్ జిల్లెలమంద.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Corona-precautions should be followed for young children

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page