తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు ఆత్మహత్య

0 8

చిట్యాల ముచ్చట్లు :

 

నెల రోజుల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన తెలంగాణ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్టెం వరలక్ష్మి కరోనాతో నెల రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు పట్టెం భవాని(17)శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన తండ్రి వీరస్వామి మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:The daughter committed suicide because she could not digest the death of the mother

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page