త‌ల్లి పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్

0 15

చెన్నై ముచ్చట్లు :

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర‌ల‌ను ఎంచుకుంటోంది. కెరీర్‌లో తొలిసారి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే..కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్‌, రైజా విల్సన్‌… ప్రధాన తారలుగా రూపొందుతోన్న చిత్రం క‌రుంగాప్పియం. ఈ సినిమాలో రీసెంట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమేంటే.. పోస్ట‌ర్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఆమె ప‌క్కన ఓ పాప నిల్చుని ఉంది. ఈ పాత్ర స్వాతంత్య్రానికి పూర్వం.. అంటే 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందులో ఓ పాప‌కు త‌ల్లి పాత్ర‌లో కాజ‌ల్ కనిపిస్తుందని స‌మాచారం. ఈ చిత్రానికి డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Kajal Agarwal in the role of mother

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page