పార్టీకి విధేయులం- నూతన చైర్మన్లు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌

0 190

పుంగనూరు ముచ్చట్లు:

 

సాధారణ కుటుంబాల్లో పుట్టిన మాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించేలా చైర్మన్‌ పదవుల్లో నియమించిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలకు విధేయులుగా ఉంటామని నూతన చైర్మన్లు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా అభివృద్ధి కమిటి చైర్మన్‌ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ పార్టీని అన్ని విధాలుగా పటిష్ట పరచి, నవరత్నాలను ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అగ్రస్థానం కల్పించి, వారి అభ్యున్నతికి ఊతం అందిస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, పార్టీ నాయకులు ఆవుల అమరేంద్ర, చంద్రారెడ్డి యాదవ్‌, కౌన్సిలర్లు అమ్ము, తుంగామంజునాథ్‌, నరసింహులు, నటరాజ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Loyal to the party- New chairmen Nagbhushanam, Venkatereddy Yadav‌

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page