పుంగనూరులో విద్యుత్‌షాక్‌తో బాలుడు మృతి

0 948

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పొలం వద్ద ఆడుకునేందుకు వెళ్లిన బాలుడికి దిగువ వ్రేలాడుతున్న విద్యుత్‌ వైర్లు తగలడంతో బాలుడు షాక్‌ కు గురై మృతి చెందిన సంఘన మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ప్రసాద్‌ కుమారుడు సందీప్‌(11 ) తమ పొలం వద్ద ఆడుకునేందుకు వెళ్లాడు. ఆసమయంలో క్రింద వ్రేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగలడంతో బాలుడు షాక్‌కు గురైయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో చెర్లోపల్లె గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోధనలు పలువురిని కలచివేసింది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Boy dies of electric shock in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page