పుంగనూరులో 19న మంత్రి పెద్దిరెడ్డిచే ఆర్మీ ఉద్యోగాల ఎంపిక ప్రారంభం

0 443

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఆయన స్థానిక శుభారాం డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్మీ ఉద్యోగాలకు నిరుద్యోగుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మండల అభివృద్ధి కమిటిచైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారు మూడువేల మంది నిరుద్యోగులు ఈ ఎంపికకు హాజరౌతున్నట్లు తెలిపారు. సుమారు 500 మందిని ఎంపిక చేసి, సైన్యంలోనికి పంపించాలన్నది మంత్రి ఆశయమని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆధ్వర్యంలో ఎంపికైన వారికి తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Selection of Army jobs by Minister Peddireddy begins on the 19th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page