మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కు అభినందనలు వెల్లువ

0 101

పుంగనూరు ముచ్చట్లు:

మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటి కమిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ ను పలువురు కలిసి సన్మానించారు. వైకాపా ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పని చేశారు. గతంలో ఎంపీపీ గా, జడ్పీటీసీగా వెంకటరెడ్డి యాదవ్ ప్రజలకు చేరువైయ్యాడు. దింతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటి కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ప్రజా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వెంకటరెడ్డి యాదవ్ సన్మానించడానికి ఆయన గృహానికి క్యూ కడుతున్నారు. ఆదివారం కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి ఆయన అనుచరులతో కలిసి వెళ్లి వెంకటరెడ్డి యాదవ్ కు దుశ్శాలువ కప్పి, పూలమాల వేసి సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, అథర్ పాల్, రాజారెడ్డి, రెడ్డెప్ప, శివ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Congratulations to Madanapalle Urban Development Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page