మాజీ ఎంపీ మాదేగౌడ కన్నుమూత

0 16

బెంగళూరు ముచ్చట్లు :

మాజీ ఎంపీ, కావేరి హితరక్షణా సమితి అధ్యక్షుడు మాదేగౌడ (92) కన్నుమూశారు. వయోభార సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన మండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎందొడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస వీడారు. 1980లో ఆర్‌ గుండూరావు కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో కిరుగావలు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీనియర్‌ రాజకీయ నేత అయినా మాదేగౌడ కావేరి పోరాటంలో ముందంజలో ఉండేవారు. అలాగే రైతు పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Former MP Madegoda eyelid

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page