మాస్క్‌ లేదని ట్రైన్ నుంచి తోసేశారు

0 20

స్పెయిన్ ముచ్చట్లు :

 

 

కరోనా వల్ల మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తప్పని సరిగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అన్ని దేశాలు సూచిస్తున్నాయి. కొందరు మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ రూటే సెపరేటు అనేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా స్పెయిన్‌లో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. లోకల్‌ మెట్రో ట్రైన్‌లో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా మాస్క్‌ ధరించకుండా ప్రయాణించాలని ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌ లేని కారణంగా ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని చెప్పారు. ఆ మాటలు వినకపోవడంతో ‍ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు దిగాల్సిందిగా ఆ వ్యక్తిని బలవంతంగా డోర్‌ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను కొంత సేపు ప్రతిఘటించిన చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్‌ డోర్‌ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు తోసేశారు. ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: No mask was thrown from the train

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page