రేపటి నుంచి రెగ్యులర్‌ రైళ్లు ప్రారంభం

0 10

హైదరాబాద్‌ ముచ్చట్లు :

దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది! గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా నిలిపివేసిన రైళ్లను విడతల వారీగా ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. సోమవారం నుంచి దశలవారీగా 82 అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు వివరించింది. వీటిలో 66 ప్యాసింజర్‌ రైళ్లు కాగా, 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తోంది. కొత్తగా పునరుద్ధరించిన 82 అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్లలో ప్రయాణించేందుకు స్టేషన్లలోని బుకింగ్‌ కౌంటర్లలో అప్పటికప్పుడే టికెట్లు తీసుకునే వెసులుబాటును కల్పించింది. సీజనల్‌ టికెట్లు కూడా అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్లలో చెల్లుబాటవుతాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సూచించారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Regular trains start from tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page