అదుపు తప్పిన కారు బోల్తా…తప్పిన ప్రాణాపాయం

0 17

వికారాబాద్    ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా పరిగిలోని బహార్ పేట మేయిన్ రోడ్డులో అర్థరాత్రి ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.మెయిన్ రోడ్డులో ఓ హోటల్ వైపు దూసుకెళ్ళి బోల్తా కొట్టింది. అర్థరాత్రి కావడంతో హోటల్ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.కారు బోల్తా పడగానే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి కారులో ఉన్న ఇద్దరిని బయటకు తీశారు.వికారాబాద్ కు చెందిన వీరిద్దరూ  తమ బంధువులను కలిసేందుకు పరిగి వచ్చారు.కారు బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవడంతో కారు అదుపు తప్పి బోల్తా పడినట్టు కారు డ్రైవర్ తెలిపాడు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వారి వివరాలు తెలుసుకొని కారును అక్కడినుండి తొలగించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Missed car overturns

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page