అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

0 6

నెల్లూరు  ముచ్చట్లు:
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్ యాదాల అన్నారు. ఆదివారం రాత్రి నెల్లూరులో గూడూరు ఒకటవ పట్టణ పోలీసులు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో సోమవారం చలో  విజయవాడ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్న గూడూరు ఒకటవ పట్టణ పోలీసులు ఎస్ఐ బ్రహ్మ నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరుకు చేరుకుని సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. సునీల్ ను గూడూరుకు తరలించారు. సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ యాదాల మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని సీఎం జగనన్నకు ఏమైందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మొక్కుబడిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం దుర్మార్గమన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించేంత వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే ఆదివారం ఏఐవైఎఫ్ గూడూరు పట్టణాధ్యక్షులు నిరంజన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Movements cannot be stopped with arrests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page