ఎమ్మెల్యే ఆనంను కలిసిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్

0 28

నెల్లూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన నామినేటెడ్ పదవుల లో భాగంగా నెల్లూరు నుడా చైర్మన్ పదవి పొందిన ముక్కాల ద్వారకానాథ్ సోమవారం మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆనం రామ నారాయణ రెడ్డి , ముక్కాల ద్వారకానాథ్కు అభినందనలు తెలియజేశారు . ఈ సందర్భంగా మొక్కల ద్వారకనాథ్ మాట్లాడుతూ  ఆర్య వైశ్య సోదరులకు వై ఎస్ జగన్ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉందనేందుకు సోదరుడు ద్వారాకనాధ్ నియామకమే నిదర్శనమన్నారు. తన మీద నమ్మకం తో అప్పగించిన పదవీ బాధ్యతలను నెరవేరుస్తూ జిల్లాలో వైకాపా బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:NUDA Chairman Mukkala Dwarkanath who met MLA Anand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page